: విజయవాడకు వెళ్లి.. చంద్రబాబును వివాహానికి ఆహ్వానించిన తెలంగాణ మంత్రి ఈటల!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తన కుమారుడు నితిన్ వివాహానికి ఆహ్వానించారు తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్. చంద్రబాబును ఆహ్వానించడానికి ఈటల విజయవాడకు వెళ్లారు. బెజవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టులో చంద్రబాబును ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పెళ్లిపత్రికను అందించారు. తన కుమారుడి పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. తప్పకుండా వస్తానని ఈటలకు చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా, ఇద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. జూన్ 18న హైదరాబాదులోని హైటెక్స్ లో ఈటల కుమారుడి వివాహం జరగనుంది.