: తెలంగాణను మేమే ఇచ్చాం.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయండి: జానారెడ్డి


2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైనా సరే... పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. సీఎం అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా సహకరిస్తానని... ఒక వేళ రేసులో నేనుంటే ఆయన సహకరిస్తారని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆమోదంతోనే సీఎం అభ్యర్థిని అధిష్ఠానం ఖరారు చేస్తుందని చెప్పారు. ఉత్తమ్ సీఎం అయినా... తాను చెప్పిన అన్ని పనులూ చేస్తారని అన్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి... తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మద్దతు పలకాలని విన్నవించారు.

  • Loading...

More Telugu News