: ఈ రోజు, రేపు అసెంబ్లీని పరిశీలించేందుకు అనుమతిస్తున్నాం: స్పీకర్ కోడెల


ఏపీ అసెంబ్లీని పరిశీలించేందుకు అందరికీ అవకాశం కల్పిస్తున్నామని స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. ఈ రోజు, రేపు అసెంబ్లీలోకి ప్రజలు, ప్రజాప్రతినిధులు, మీడియాకు అనుమతినిస్తున్నామని అన్నారు. అసెంబ్లీ భవనాలపై ప్రతిపక్ష సభ్యులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, మీడియాను తీసుకువెళ్లేందుకు ముందుగా అడిగి ఉంటే అనుమతి ఇచ్చేవాడినని అన్నారు. అసెంబ్లీ భవనాలు ప్రారంభించి నాలుగు నెలలు అయిందని, సమావేశాలు జరిగే సమయంలో వర్షాలు పడ్డాయని, అప్పుడు లేని లీక్ ఇప్పుడు ఎందుకు అయిందో విచారణలో తేలుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News