: వాజ్ పేయి మాకు స్వయంగా గొడ్డు మాంసం వడ్డించారు!: చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు
మాజీ ప్రధాని వాజ్ పేయి గురించి కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గొడ్డు మాంసాన్ని వాజ్ పేయి స్వయంగా తమకు వడ్డించారని చెప్పారు. ఈ పని చేసిన ఏడాది కాలానికే ఆయన ప్రధాన మంత్రి అయ్యారని తెలిపారు. 1997లో ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్ పేయి... తనతో పాటు, బీఎస్పీ అధినేత కాన్షీరామ్ ను విందుకు ఆహ్వానించారని...తన ఇంట్లోనే పశుమాంసంతో చేసిన వంటకాలను స్వయంగా వడ్డించారని చెప్పారు. భారతదేశంలో ఎవరు ఏది తినాలో, ఏది తినకూడదో చెప్పే అధికారం ఎవరికీ లేదని ఆయన తెలిపారు. బీఫ్ అమ్మకాలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.