: మానవ మృగం జనరల్ డయ్యర్‌తో ఆర్మీచీఫ్‌ను పోల్చడం దారుణం: నేవీ చీఫ్ సునీల్ లాంబా
1919 నాటి జలియన్‌వాలా బాగ్ మారణకాండకు కారణమైన బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్‌తో భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌ను పోల్చడం దారుణమని నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా విచారం వ్యక్తం చేశారు. ఓ న్యూస్ వెబ్‌సైట్‌కు విద్యావేత్త పార్థ చటర్జీ రాసిన వ్యాసంలో రావత్‌ను డయ్యర్‌తో పోల్చారు. ఇటీవల మేజర్ లీతుల్ గొగోయ్ ఓ పౌరుడిని మానవ కవచంగా ఉపయోగించుకున్నారు. దీనిని రావత్ సమర్థించారు. ఈ ఘటనను గుర్తుచేస్తూ మానవమృగమైన జనరల్ డయ్యర్‌తో రావత్‌ను పోల్చారు. చటర్జీ పోలికపై స్పందించిన లాంబా మాట్లాడుతూ ఇది విచారకరమైన పోలిక అని అన్నారు. నేవల్ పర్వతారోహక బృందాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఆయన అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.