: సంతాప సభలో దాసరి కాంస్య విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు


ఇటీవల మృతి చెందిన దర్శకుడు దాసరి నారాయణరావు సంతాప సభ ఈ నెల 11న మాదాపూర్ లోని ఇమేజ్ గార్డెన్స్ లో జరగనుంది. ఈ సందర్భంగా దాసరి కాంస్య విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహాన్నిఅనకాపల్లికి చెందిన శిల్పి కామధేనువు ప్రసాద్  తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంతాప సభలో దాసరి విగ్రహాన్ని ఏర్పాటు చేసే నిమిత్తం దీనిని తయారు చేయాలని ఆయన కుటుంబసభ్యులు కోరినట్టు చెప్పారు. దీంతో పాటు, ఫిలింనగర్ లో ఏర్పాటు చేసేందుకు తొమ్మిది అడుగుల దాసరి విగ్రహాన్నీ తయారు చేస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News