: చంద్రబాబును చూడాలని వచ్చా.. ఓ పాట పాడతానన్న వృద్ధురాలు!

తనను చూసేందుకు వచ్చిన ఓ వృద్ధురాలిని సీఎం చంద్రబాబు ప్రేమగా పలుకరించి, ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. నిన్న జరిగిన నవనిర్మాణ దీక్ష ముగింపు సమయంలో కాకినాడకు చెందిన ఎనభై ఏళ్ల వృద్ధురాలు రాఘవమ్మ వేదికపైకి వెళ్లారు. నలభై నాల్గవ డివిజన్ కు చెందిన రాఘవమ్మ వేదికపైకి ఎక్కి.. ‘చంద్రబాబును దగ్గరగా చూడాలని ఇక్కడికి వచ్చాను. ఒక పాట పాడతాను’ అన్నారు.

‘నారా చంద్రబాబు.. నిన్ను చూడాలని ఉంది. గోడల మీద, గుండెల మీద చూశాను. అయినా నా కడుపు నిండలేదు.. కళ్లు నిండలేదు. నెలకు రెండొందల పింఛన్ పోయి.. వెయ్యి రూపాయలు చేశావు. మా బోటివాళ్లకు పెద్దకొడుకువయ్యావు. నీ తల్లికే నీవు కొడుకువి కాదయ్యా..’ అంటూ తన పాటను ఆమె కొనసాగించారు. దీంతో, పరవశించిపోయిన చంద్రబాబు, ఆమె యోగ క్షేమాలు అడిగి తెలుసుకోవడంతో ఆ వృద్ధురాలి ఆనందానికి హద్దుల్లేవు.

More Telugu News