: ఇజ్రాయెల్ లో పర్యటించనున్న భారత ప్రధాని మోదీ


భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి ఇరవై ఐదేళ్లు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలో పర్యటించనున్నారు. జులై 4వ తేదీ నుంచి మూడు రోజుల పాటు మోదీ అక్కడ పర్యటిస్తారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, మన దేశం తరపున ఇజ్రాయెల్ లో పర్యటిస్తున్న మొదటి ప్రధాని మోదీ కావడం విశేషం.

ఈ పర్యటనలో భాగంగా తొలి రోజున ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్చలు జరుపుతారు. రెండో రోజున టెల్ అవివ్ లోని భారత సంతతి ప్రజలతో సమావేశమవుతారు. కాగా, ఇజ్రాయెల్ లో సుమారు ఎనభై వేల మంది భారతీయ యూదులు నివసిస్తున్నారు. భారతీయ యూదులను బెనె ఇజ్రాయెల్, కొచ్చినీస్, బాగ్దాదీస్, బెనయ్ మెనాషేగా నాలుగు సామాజిక వర్గాలుగా ఇక్కడ గుర్తిస్తున్నారు. వీరందరూ మోదీకి ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు.

  • Loading...

More Telugu News