: టీడీపీకి కొత్త అర్థం చెప్పిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి


టీడీపీ అంటే తినడం, దోచుకోవడం, పంచుకోవడమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబు మూడేళ్ల పాలన అట్టర్ ప్లాప్ అయిందని, ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ‘పోలవరం’ నిర్మాణం, ఏపీకి ప్రత్యేకహోదా సాధించడం సహా అన్నింటిలో చంద్రబాబు విఫలమయ్యారని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News