: ఏపీ సచివాలయం మూడో బ్లాక్ లో నిలిచిపోయిన లిఫ్ట్!
ఏపీ సచివాలయం, అసెంబ్లీలోని ఛాంబర్లలోకి వర్షపు నీరు చేరడంపై ఇప్పటికే పలు విమర్శలు తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా, సచివాలయంలోని మూడో బ్లాక్ లో లిఫ్ట్ నిలిచిపోయింది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో సుమారు ఏడెనిమిది మంది పారిశుద్ధ్య సిబ్బంది, ఇద్దరు సందర్శకులు మూడో బ్లాకు నుంచి కిందకు దిగేందుకు లిఫ్ట్ ఎక్కారు. గ్రౌండ్ ఫ్లోర్ కు వచ్చిన లిఫ్ట్ డోర్లు ఎంతకీ ఓపెన్ కాకపోవడంతో అందులోని వారు ఇబ్బందిపడ్డారు. ఈ క్రమంలో ఈ సమాచారం సచివాలయ సెక్యూరిటీ సిబ్బందికి తెలియడంతో అక్కడికి వెళ్లారు. లిఫ్ట్ నిర్వాహకులను పిలిపించడంతో వారు డోర్లు తెరిచారు. లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన వారిలో ఓ దివ్యాంగుడు కూడా ఉన్నట్టు సమాచారం.