: ఒకే బైక్ పై ముగ్గురు.. అందులో రాహుల్ గాంధీ ఒకరు.. వీడియో చూడండి!
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకూడదని, నియమ నిబంధనలు పాటిస్తూ చట్టాలను గౌరవించాలని ట్రాఫిక్ పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ చెబుతుంటారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఫైన్ వేస్తుంటారు. అయితే, అందరికీ ఆదర్శంగా వుండాల్సిన హోదాలో ఉండి, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే? మధ్య ప్రదేశ్‌లో అటువంటిదే జరిగింది.
ఆ రాష్ట్రంలో రైతుల ధర్నాలకు మద్దతుగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ రోజు ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్నారు. మాందసౌర్ జిల్లాలోకి మొదట కాన్వాయ్‌తో వచ్చిన రాహుల్ గాంధీని అక్కడి పోలీసులు అడ్డుకోవడంతో ఆయన ఇలా బైక్‌పై ఆ జిల్లాలోకి మళ్లీ వెళ్లారు. ఒక ద్విచక్రవాహనంపై ఇద్దరికి మించి వెళ్లకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ.. దాన్ని ఉల్లంఘిస్తూ.. రాహుల్‌గాంధీ, స్థానిక కాంగ్రెస్ నేత, భద్రతా సిబ్బంది ఒకరు సహా మొత్తం ముగ్గురు ఒకే బైక్‌పై రయ్ మంటూ వెళ్లిపోయారు. ఆ బైక్‌ని నడిపిన వ్యక్తి హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. కాగా, నిముచ్ సమీపానికి చేరుకున్న రాహుల్‌ను పోలీసులు మరోసారి అడ్డుకున్నారు.