: మైదానంలోనే తొడగొట్టిన శిఖర్ ధావన్!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ రోజు ధాటిగా ఆడి సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 97 పరుగుల వద్ద ఉండి సెంచరీకి చేరువైన ధావన్.. 40వ ఓవర్ వేస్తోన్న ప్రదీప్ బౌలింగ్‌లో 4వ బంతిని పాయింట్ దిశగా బౌండరీకి తరలించి, 101 పరుగులు పూర్తి చేసి, శతకం నమోదు చేసుకున్నాడు. దీంతో ఆనందంతో తనదైన శైలిలో అభివాదం చేస్తూ మైదానంలోనే తొడగొట్టి అభిమానుల్ని ఉత్సాహపరిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ధావన్‌కి ఇది మూడో శతకం. ఛాంపియన్స్ ట్రోఫీలో గిబ్స్, గంగూలీ, క్రిస్‌గేల్ మాత్రమే మూడు శతకాలు నమోదు చేశారు. ఇప్పుడు ఆ జాబితాలో ధావన్ చేరాడు.