: భారత్, శ్రీలంక మ్యాచ్: ఆదిలోనే శ్రీలంకకు ఎదురుదెబ్బ
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా... శ్రీలంక ముందు 322 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన విషయం తెలిసిందే. బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక జట్టుకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 11 పరుగుల వద్ద వెల్లా (7).. కుమార్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి మాండిస్ వచ్చాడు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు ఐదు ఓవర్లకి ఒక వికెట్ నష్టానికి 15 పరుగులుగా ఉంది. క్రీజులో మరో ఓపెనర్ గునా ఏడు పరుగులతో ఉన్నాడు.