: పని చేయని అధికారులను గుర్తుపెట్టుకుంటాం: చెవిరెడ్డి భాస్కరరెడ్డి
ఏడాదిన్నర కాలంలో తాము అధికారంలోకి వస్తామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. చిత్తూరులో జరిగిన పార్టీ ప్లీనరీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో అధికారులపై ఆయన విమర్శలు గుప్పించారు. తహసీల్దార్, ఎస్సై..ఇలా పనిచేయని అధికారులు ఎవరైనా సరే, గుర్తుపెట్టుకుంటామని, తాము అధికారంలోకి రాగానే వారిని అండమాన్ దీవులకు పంపుతామని అన్నారు. ఇప్పుడు అధర్మంగా పని చేసే అధికారులను తమ ప్రభుత్వం రాగానే వారిని వెంటాడతామని చెవిరెడ్డి హెచ్చరించారు.