: రైతులను మోసం చేసే కంపెనీలపై పీడీ చట్టం: ఏపీ మంత్రులు
రైతులను మోసం చేసే కంపెనీలపై పీడీ చట్టం ప్రయోగిస్తామని ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి హెచ్చరించారు. కడపలో మహాసంకల్ప దీక్షలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బిందు సేద్యంలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపేలా చర్యలు తీసుకుంటామని, ఉద్యాన పంటలను కాపాడేందుకు రూ.1100 కోట్లు ఖర్చు చేశామని ఈ సందర్భంగా చెప్పారు.