: ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో బోపన్న జోడీ విజయం


ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్లో  భారత ఆటగాడు రోహన్ బోపన్న, కెనడా క్రీడాకారిణి గాబ్రియెలా డబ్రోస్కి జోడీ విజయం సాధించింది. జర్మనీ ప్లేయర్ గ్రోన్ ఫీల్డ్, కొలంబియా క్రీడాకారిణి ఫరాను ఓడించారు. తొలిసెట్ ను  2-6 తో బోపన్న జోడీ కోల్పోయింది. ఆ తర్వాత పుంజుకుని రెండో సెట్ ను 6-2తో కైవసం చేసుకుంది. దీంతో, మూడో సెట్ ను గెలుచుకునేందుకు బోపన్న జోడీ, గ్రోన్ ఫీల్డ్ జోడీ హోరాహోరీగా తలపడగా, ఆ సెట్ ను 12-10 తో బోపన్న జోడీ కైవసం చేసుకుంది. కాగా, ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ సాధించడంతో రోహన్ బోపన్న కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ సాధించినట్టయింది.

  • Loading...

More Telugu News