: చివర్లో మెరుపులు మెరిపించి అర్ధసెంచరీ సాధించిన ధోనీ.. శ్రీ‌లంక విజ‌య ల‌క్ష్యం 322


లండ‌న్‌లోని ఓవ‌ల్‌లో ఈ రోజు శ్రీ‌లంకతో జ‌రుగుతున్న‌ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ రాణించారు. చివ‌ర్లో చూడ‌చ‌క్క‌ని షాట్ల‌తో ధోనీ అర్ధ‌సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. అనంత‌రం 63 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద‌ భారీ షాట్‌కి ప్ర‌య‌త్నించిన ధోనీ క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 321 ప‌రుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ శ‌ర్మ 78, శిఖ‌ర్ ధావ‌న్ 125, విరాట్ కోహ్లీ 0, యువ‌రాజ్ సింగ్ 7, మ‌హేంద్ర సింగ్ ధోనీ 63, హార్ధిక్ పాండ్యా 9, జాదవ్ 25 (నాటౌట్), జడేజా 0 (నాటౌట్) ప‌రుగులు చేశారు. భారత్ కి ఎక్స్ ట్రాల రూపంలో మరో 14 పరుగులు వచ్చాయి. శ్రీలంక బౌల‌ర్ల‌లో మలింగ‌కి రెండు వికెట్లు ద‌క్కాగా... ల‌క్మ‌ల్‌, ప్ర‌దీప్‌, అసేలా, తిషారాల‌కు చెరో వికెట్ ద‌క్కాయి.               

  • Loading...

More Telugu News