: నకిలీనోట్ల చలామణికి పాల్పడుతున్న శాండిల్‌వుడ్ నటి.. అరెస్ట్


కన్నడ సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న జయమ్మ నకిలీనోట్లు చలామణీ చేస్తూ దొరికిపోయింది. ఈ రోజు కర్ణాటకలోని డాబస్‌పేటే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ షాపు వ‌ద్ద‌కు వచ్చి రూ. 2 వేల నకిలీనోట్లు చలామణి చేయ‌డానికి ప్ర‌య‌త్నించింది. అనుమానం వచ్చిన  షాపు యజమాని ఆమెను ప్రశ్నించగా ఆమె అక్క‌డి నుంచి పారిపోవాల‌ని చూసింది. దీంతో ఆయ‌నతో పాటు స్థానికులు ఆమెను వెంబ‌డించి ప‌ట్టుకున్నాడు. ఆమె వద్ద భారీగా న‌కిలీ నోట్లు ఉన్న‌ట్లు గుర్తించారు.

ఆమెపై వారు స్థానిక‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్ధలికి చేరుకున్న పోలీసులు ఆ న‌టితో పాటు ఆమెకు స‌హ‌క‌రిస్తున్న‌ ఆటోడ్రైవరు గోవిందరాజు అనే వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు కొందరు నిర్మాతలు, నటులు కూడా నకిలీనోట్ల చలామణికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. జయమ్మ సెల్‌ఫోన్‌ ఆధారంగా ఈ కేసులో ద‌ర్యాప్తు ప్రారంభించారు.                  

  • Loading...

More Telugu News