: ఏపీలో ఎక్కడా ప్లాస్టిక్ బియ్యం లేవు: అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు
ఏపీలో ఎక్కడా ప్లాస్టిక్ బియ్యం లేవని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆహార కల్తీ నియంత్రణ శాఖ తనిఖీలు నిర్వహించిందని, ప్లాస్టిక్ బియ్యం లేవని తనిఖీల్లో, పరీక్షల్లో తేలిందని చెప్పారు. ప్లాస్టిక్ బియ్యంపై ప్రజలు ఆందోళన చెందవద్దని, అనుమానాలుంటే ఆహార కల్తీ నియంత్రణ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్లాస్టిక్ బియ్యం తయారీ మామూలు బియ్యం కంటే ఖరీదైన వ్యవహారమని, మామూలు బియ్యం, ఈ బియ్యం రెండూ ఒకే ఉష్ణోగ్రతతో ఉడకవని అన్నారు. బియ్యంపై అయోడిన్ లేదా టింక్చర్ చుక్కలు వేస్తే నీలి రంగుగా మారితే అవి అసలు బియ్యమని, ప్లాస్టిక్ బియ్యంపై అయోడిన్ చుక్కలు వేస్తే ఎలాంటి మార్పులు ఉండవని ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు.