: ‘ఉపాధి హామీ’ వేతనాలు ఏడు రోజుల్లోగా చెల్లించాలి: నారా లోకేశ్ ఆదేశం
ఉపాధి హామీ వేతనదారుల సమస్యలపై ఏపీ మంత్రి నారా లోకేష్ నేడు నేరుగా అధికారులతో సమీక్షించారు. ఉపాధి హామీ వేతనదారులకు పని దొరకట్లేదని, వేతనాలు సమయానికి అందట్లేదనే ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని, వేతన దారులకు అడిగినప్పుడు పని ఇవ్వాలని, వారికి ఏడు రోజుల్లో వేతనాలు చెల్లించాలని లోకేశ్ ఆదేశించారు. ఉపాధి హామీ పథకాన్ని రియల్ టైం గవర్నెన్స్ కు అనుసంధానం చేయాలని అన్నారు.