: భారత్-శ్రీలంక రికార్డు: రెండు దేశాలు 150 వన్డేల్లో తలపడడం ఇదే తొలిసారి!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2017లో భాగంగా లండన్ వేదికగా ఈ రోజు భారత్, శ్రీలంక క్రికెట్ జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పరస్పరం 149 వన్డేల్లో తలపడ్డ భారత్, శ్రీలంక నేడు 150వ వన్డేలో తలపడుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన 149 వన్డేల్లో టీమిండియాదే పై చేయి. 83 మ్యాచుల్లో భారత్ గెలవగా, శ్రీలంక 54 మ్యాచుల్లో గెలిచింది. కాగా ఒక మ్యాచ్ టైగా ముగియగా, ఫలితం తేలని మ్యాచ్‌లు 11 ఉన్నాయి. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ రెండు దేశాలు 150 వన్డేల్లో ఆడలేదు. టీమిండియా, శ్రీలంక క్రికెట్ జట్లు తొలిసారి 150 వన్డేల్లో ఆడిన జట్లుగా నిలిచాయి.