: అందుకే, ఉద్యోగులంతా ఆయనను శ'బాస్' అన్నారు!
మీటింగ్ ఉందంటూ తమ ఉద్యోగులను పిలిచిన ఎన్‌సాఫ్ట్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థ ఫౌండర్, ఓనర్ క్రెజిక్ వారికి పలు సూచనలు చేశాడు. అనంతరం మీటింగ్ అయిపోగానే అక్కడి నుంచి లేచి వెళ్లి అందరూ చూస్తుండగా ఆ భవన బాల్కనీలోంచి అమాంతం కిందకు దూకేశాడు. బాస్ ఇలా చేశాడేంటీ అనుకుంటూ బాల్కనీలోకి పరిగెత్తుకుంటూ వచ్చిన ఉద్యోగులు కిందకి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంత ఎత్తుపై నుంచి దూకాడు కాబట్టి ప్రాణాలు గాల్లో కలిసేపోయుంటాయని అనుకున్న ఉద్యోగులు.. అసలు విషయాన్ని తెలుసుకొని హ్యాపీగా నవ్వేశారు. ఎందుకంటే, వారి బాస్ ఎవరికీ చెప్పకుండా ముందుగానే కింద క్రాష్ మ్యాట్ ఏర్పాటు చేసుకుని దానిపైకి దూకాడు. దీంతో ఆయనకు ఎటువంటి గాయం కాలేదు.
బోస్నియా అండ్ హెర్జిగోవినాలోని మోస్టర్‌లో ఈ సాఫ్ట్‌వేర్ సంస్థ ఉంటుంది. అప్పుడప్పుడు ఈ బాస్ గారు ఉద్యోగులకు ఇలాంటి సరదా పనులు చేస్తూ షాక్ ఇస్తుంటాడు. ఈసారి ఇలా కొత్త ప్రయోగాన్ని చేసి చూపించాడు. తన ఉద్యోగులకు ‘పొలిటికల్ సూసైడ్’ అనే అంశం గురించి చెప్పడానికే తాను అలా చేశానని, తాను బాల్కనీలోంచి ప్లాన్ ప్రకారం దూకేసిన అంశంపై క్రెజిక్ వివరించి చెప్పాడు.