: అసెంబ్లీ, సచివాలయంలో కారింది వర్షపు నీరు కాదు.. టీడీపీ అవినీతి!: అంబటి రాంబాబు


ఇటీవల కురిసిన వర్షాలకు ఏపీ అసెంబ్లీలోని పలు ఛాంబర్లలోకి వర్షపు నీరు చేరడంపై విమర్శలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ, సచివాలయంలో కారింది వర్షపు నీరు కాదని, టీడీపీ అవినీతి అని తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు ఛాంబర్ కు బుల్లెట్ ప్రూఫ్, లాంచర్ ప్రూఫ్.. ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్ కు మాత్రం వాటర్ ప్రూఫ్ కూడా లేకుండా చేశారని ఆయన మండిపడ్డారు. చిన్నపాటి వర్షానికే జగన్ ఛాంబర్ వర్షపు నీటి మయమైందని అన్నారు. సచివాలయంలోనూ అదే పరిస్థితి నెలకొందని, లీకేజ్ లపై వైఎస్సార్సీపీ కుట్ర చేసిందంటూ కొందరు నీచంగా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలోని అన్ని నిర్మాణాలను సీబీఐ విచారణలో చేర్చాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News