: వర్షపు నీరు లీకుపై స్పీకర్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి: బొత్స


అమరావతి అసెంబ్లీలో జగన్ కార్యాలయంలో వర్షపు నీరు లీకుపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఒక్క వర్షానికే అసెంబ్లీ నిర్మాణంలోని డొల్లతనం బయటపడిందని ఎద్దేవా చేశారు. చదరపు అడుగు నిర్మాణానికి రూ. 2 వేలకు బదులు రూ. 9 వేలు ఇచ్చి... భారీ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. వర్షపు నీరు లీకవడంపై స్పీకర్ వ్యాఖ్యలకు, సీఆర్డీఏ కమిషనర్ వ్యాఖ్యలకు పొంతనే లేదని మండిపడ్డారు. కేవలం జగన్ ఛాంబర్ కే విచారణను పరిమితం చేస్తున్నారని... బిల్డింగ్ లో జరిగిన మొత్తం లీకులపై దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News