: కోచింగ్ సెంటర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన సివిల్స్ టాపర్!


సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో మూడో ర్యాంకును కైవసం చేసుకున్న తెలుగుతేజం రోణంకి గోపాలకృష్ణ కోచింగ్ సెంటర్ల వ్యవహారశైలిపై మండిపడ్డారు. కొన్ని కోచింగ్ సెంటర్లు తన పేరును వాడుకుంటున్నాయని... తాను ఎక్కడా కోచింగ్ తీసుకోలేదని ఆయన తెలిపారు. హైదరాబాదులోని పలు కోచింగ్ సెంటర్లు తన పేరు, ర్యాంకుతో ప్రకటనలు ఇస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలా దారుణమని అన్నారు. కోచింగ్ సెంటర్లు చెప్పే మాయమాటలను విని ఎవరూ మోసపోవద్దని హెచ్చరించారు. తన పేరుతో కోచింగ్ సెంటర్లు ఇస్తున్నవన్నీ తప్పుడు ప్రకటనలే అని చెప్పారు. తెలుగు సాహిత్యాన్ని తాను సొంతంగానే చదివానని.. జనరల్ స్టడీస్ మాత్రం బాల లతగారి వద్ద శిక్షణ పొందానని తెలిపారు. సివిల్స్ కు ప్రిపేర్ అయ్యేవారు సొంత ప్రిపరేషన్ కు ప్రాధాన్యత ఇస్తేనే మంచిదని... అలా కుదరని పక్షంలోనే కోచింగ్ కు వెళ్లాలని సూచించారు.


  • Loading...

More Telugu News