: చేపల చెరువులో మొసలి.. వల వేసి బంధించిన గ్రామస్తులు!


చేపల చెరువులో మొసలి కనిపించిన ఘటన వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొత్తపల్లిలో చోటు చేసుకుంది. తాను నిర్వహిస్తున్న చెరువులో చేపల సంఖ్య తగ్గిపోతుండడంతో కంగారు పడిపోతున్న లక్ష్మీకాంత్‌రెడ్డి అనే వ్యక్తి... తన చేపల చెరువులో మొసలి ఉంద‌ని గుర్తించాడు. త‌న‌ చెరువులో చేపలను తినేస్తున్న ఆ మొస‌లిని గ్రామ‌స్తుల‌ సాయంతో వలవేసి బంధించాడు. అనంత‌రం ఈ విష‌యాన్ని అటవీశాఖ అధికారులకు చెప్పారు. ఆ గ్రామానికి వచ్చిన అధికారులు ఆ మొసలిని స్వాధీనం చేసుకుని, జూరాల జలాశయంలో దానిని విడిచిపెట్టారు. 

  • Loading...

More Telugu News