: బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లండన్‌లోని ఓవల్‌లో ఈ రోజు జరుగుతున్న భారత్, శ్రీలంక మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. దీంతో టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా రోహిత్, ధావన్ మైదానంలోకి వచ్చారు. ఈ నెల 4వ తేదీన పాకిస్థాన్‌ని చిత్తుగా ఓడించిన ఉత్సాహంతో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ లోనూ అదే దూకుడుగా రాణించాలనుకుంటోంది. ఈ నెల 3న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఘోరంగా ఓటమిపాలయిన శ్రీలంక జట్టు ఇందులోనైనా గెలవాలని ప్రణాళికలు వేసుకుంది.