: రాహుల్ గాంధీని అరెస్టు చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు!
మధ్యప్రదేశ్‌లో రైతన్నలు ప్రారంభించిన ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. మొన్న పోలీసు తుపాకుల తూటాలకు ఐదుగురు బలి కావడంపై రైతులు భగ్గుమంటున్నారు. వారి ఉద్యమానికి మద్దతు తెలపడానికి ఈ రోజు ఆ రాష్ట్రానికి రాహుల్ గాంధీ వచ్చారు. అయితే, మంద్‌సౌర్ ప్రాంతంలో రాహుల్ అడుగుపెట్టగానే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో రాహుల్ పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ రాహుల్ అక్కడకు చేరుకోవడంతో ఆయనను అరెస్టు చేశారు. పోలీసులు తనను అరెస్టు చేశారని, కనీసం ఎందుకు అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పలేదని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇటీవల తనకు ఉత్తరప్రదేశ్‌లోనూ ఇటువంటి అనుభవమే ఎదురైందని అన్నారు. పోలీసులు రాహుల్ ను బలవంతంగా ఒక బస్సులోకి ఎక్కించి గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు.