: కేరళ అసెంబ్లీ క్యాంటీన్ లో బీఫ్ ఫ్రై.. ఆరగించిన ఎమ్మెల్యేలు!


పశువుల అమ్మకాలపై కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై చర్చించేందుకు కేరళ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా అసెంబ్లీ క్యాంటీన్ లో బీఫ్ ఫ్రైను ప్రత్యేకంగా తయారు చేశారు. ఎమ్మెల్యేలంతా బీఫ్ ఫ్రైని ఆరగించి, ఆ తరువాత అసెంబ్లీలో బీఫ్ బ్యాన్ గురించి చర్చించేందుకు లోనికెళ్లారు. దీనిపై క్యాంటీన్ సిబ్బంది మాట్లాడుతూ, బీఫ్ బ్యాన్ గురించి చర్చించేందుకు అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ఉండడంతో ఎమ్మెల్యేలంతా వస్తారని భావించి... పది కేజీల బీఫ్ ను తీసుకొచ్చి బాగా వండామని చెప్పారు. తాము చేసిన బీఫ్ ఫ్రైను ఆరగించిన తరువాతే ఎమ్మెల్యేలు చర్చకు వెళ్లారని చెప్పారు. ఇష్టమైన ఆహారం తినకుండా అడ్డుకోవడం వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమేనని అభిప్రాయపడి, కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది.

  • Loading...

More Telugu News