: ఫోర్బ్స్ అథ్లెట్ల జాబితాలో భారత్ నుంచి ఒకేఒక్కడు!


ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్ల నుంచి టాప్-100 జాబితాను ప్రముఖ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ వెల్లడించగా, ఇండియా నుంచి ఒకే ఒక్కడికి స్థానం లభించింది. భారత్ కు చెందిన విరాట్ కోహ్లీ ఈ జాబితాలో 89వ స్థానంలో నిలువగా, మరెవరికీ స్థానం దక్కలేదు.  'ది వరల్డ్స్ హైయస్ట్ పెయిడ్ అథ్లెటిక్స్' జాబితాలో ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానా రొనాల్డో తొలి స్థానంలో నిలిచాడు. రొనాల్డో పారితోషికం 86.2 మిలియన్ డాలర్లని ఫోర్బ్స్ తెలిపింది.

ఇక కోహ్లీ విషయానికి వస్తే, అతను 22 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 141 కోట్లు) సంపాదించాడని, పారితోషికంగా 3 మిలియన్ డాలర్లు, వివిధ కంపెనీలకు ప్రచారకర్తగా మరో 19 మిలియన్ డాలర్లను ఆయన పొందాడని, విరాట్ 'ఇండియన్ క్రికెట్ ఫెనోమ్' అని ఫోర్బ్స్ అభివర్ణించింది. ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో అమెరికన్ బాస్కెట్ బాల్ ఆటగాడు లీబ్రోన్ జామ్స్ (86.2 మి. డాలర్లు) నిలిచాడు. మొత్తం 21 దేశాలకు ఈ జాబితాలో చోటు లభించగా, అమెరికాకు చెందిన 63 మందికి స్థానం లభించడం విశేషం.

  • Loading...

More Telugu News