: చైనాలో చిరంజీవి దంపతుల సందడి!


ఇండియాలో ఎక్కడా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే ధైర్యం చేయలేని దక్షిణాది నటీనటులంతా ఇప్పుడు చైనా రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. 1980 దశకంలో ఓ వెలుగు వెలిగిన హీరోలు, హీరోయిన్లు ప్రతి సంవత్సరమూ ఎక్కడో ఓ చోట కలిసి పార్టీ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. ఇండియాలో ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ కారణంతో, ఇక్కడ స్వేచ్ఛగా తిరగలేని వీరంతా, చైనాలో రైల్వే స్టేషన్ల నుంచి స్టేడియాల వరకూ తిరుగుతూ, తమ ఫోటోలను ఆన్ లైన్లో అప్ లోడ్ చేస్తున్నారు. తన భార్య సురేఖతో కలసి చైనాకు వెళ్లిన మెగాస్టార్, ఓ రైల్వే స్టేషన్లో ఫోటోలు దిగి అభిమానులతో పంచుకున్నారు. పలువురు హీరోలు, హీరోయిన్లు చైనాలో ఇప్పుడు ఆనందంగా గడుపుతూ, తమకు నచ్చిన ప్రాంతాలను చుట్టేస్తున్నారు. చిరంజీవి పంచుకున్న ఫోటోలు మీరూ చూడండి!

  • Loading...

More Telugu News