: సుమశ్రీ కేసులో కొత్త ట్విస్టు....శివశ్రీ భర్త కృష్ణ కుమార్ తన వాడంటూ నీలిమ ఆందోళన!
విజయవాడలోని దుర్గాపురంలో అపార్ట్ మెంట్ అమ్మి వైద్యం చేయించు డాడీ.. అంటూ కేన్సర్ తో బాధపడుతున్న సుమశ్రీ అనే బాలిక మాదంశెట్టి శివకుమార్ అనే వ్యక్తిని కోరుతూ సెల్ఫీ వీడియో పోస్టు చేసి, వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అనంతరం సుమశ్రీ అసలు తన కుమార్తే కాదని, సుమశ్రీ తల్లి శివశ్రీ కేరెక్టర్ మంచిది కాదని, మానవత్వంతో తాను సుమశ్రీ వైద్యానికి సాయం చేశానని...తాను శివశ్రీ భర్తను కాదని, ఆమె భర్త కృష్ణకుమార్ అని పేర్కొంటూ పలు టీవీ ఛానెళ్లు, పత్రికలకు ఆయన లేఖలు పంపిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో కృష్ణకుమార్ తనకు విడాకులివ్వకుండా శివశ్రీని వివాహం చేసుకున్నాడని ఆరోపిస్తూ, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నీలిమ అనే మహిళ శివశ్రీ నివాసం వద్ద ఆందోళన చేసింది. తమకు ఇద్దరు ఆడపిల్లలని కూడా ఆమె పేర్కొంది.
దీనిపై కృష్ణకుమార్ మాట్లాడుతూ, నీలిమ తన భార్య కాదని, వేరొకరి భార్య అని చెబుతున్నారు. ఆ పిల్లలు కూడా తమ పిల్లలు కాదని ఆయన స్పష్టం చేశారు. శివశ్రీ మాజీ భర్త మాదంశెట్టి శివకుమార్ ఒత్తిడి మేరకు ఆమె ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు. ఈ విషయంపై కోర్టులో కేసు నడుస్తోందని, అక్కడే తేల్చుకుంటానని ఆయన చెప్పారు. దీనిపై నీలిమ మాట్లాడుతూ, ఆయనతో తనకు వివాహమైందని నిరూపించేందుకు సిధ్ధమని తెలిపారు. అలాగే పిల్లలు కృష్ణ కుమార్ పిల్లలని నిరూపించేందుకు డీఎన్ఏ టెస్టుకి కూడా సిద్ధమని సవాల్ విసిరారు.