: తిరుమలలో దోపిడీ దొంగల ముఠా... నగదు, ఆభరణాలు సహా 8 మంది అరెస్ట్


శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడం కోసం తిరుమలకు వచ్చే భక్తులే లక్ష్యంగా సంచరిస్తున్న ఎనిమిది మంది సభ్యుల భారీ దోపిడీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ దోపిడీ ముఠా వెలుగులోకి వచ్చింది. ముఠాలోని సభ్యులందరినీ అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి ఓ స్కార్పియో వాహనం, రూ. 4 లక్షల విలువైన ఆభరణాలు, రూ. 32 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చాలా రోజులుగా వీరి దందా సాగుతున్నట్టు అనుమానిస్తున్నామని, వీరి దొంగతనాలపై మరింత విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News