: ఎల్అండ్ టీ, రిలయన్స్ జియోలపై హైదరాబాద్ లో క్రిమినల్ కేసులు


హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు తీసి, తమ పనులు పూర్తి చేసుకుని, ఆపై వాటిని పూడ్చని ఎల్ అండ్ టీ, రిలయన్స్ జియో సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల క్వార్టర్స్ నుంచి యూసఫ్ గూడ వెళ్లే దారిలో మెట్రో పిల్లర్ల కోసం తీసిన గుంతలను పనులు పూర్తయినా కూడా ఎల్ అండ్ టీ పూడ్చలేదు. రాత్రి కురిసిన వర్షానికి ఈ గుంతల్లో నీరు నిండిపోవడంతో, జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇక బోరబండ సైట్ - 2లో జియో సిబ్బంది టవర్ల కోసం గుంతలు తీశారు. దీనిపై ఎస్ ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత రాత్రి కురిసిన వర్షానికి ఇంకా పలు లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నీటిని తొలగించేందుకు మునిసిపల్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నప్పటికీ, నాలాల్లో నిండిన చెత్త తీవ్ర అడ్డంకులు కలిగిస్తోంది.

  • Loading...

More Telugu News