: హీరోయిన్ లా కనిపించే మధ్యప్రదేశ్ బబ్లీ... చేస్తున్న ఉద్యోగం మునిసిపల్ స్వీపర్... చూడండి!


ఆ యువతి పేరు బబ్లీ... చూడగానే ఆకట్టుకునే రూపం. అందుకు తగ్గట్టుగానే నిత్యమూ మంచి డ్రస్ వేసుకుని, అంతే స్థాయిలో మేకప్ చేసుకుని తన పని పూర్తి చేసేందుకు వచ్చేస్తుంది. వీధిలో ఆమెను చూసిన వారెవరైనా ఎవరో సినిమా హీరోయిన్ వచ్చిందని, ఇక్కడేదో షూటింగ్ ఉందని అనుకోవాల్సిందే. ఇంతకీ ఈమె ఏం చేస్తుందో తెలుసా? మధ్యప్రదేశ్‌లోని ఓంకారేశ్వర్‌ మున్సిపాలిటీలో స్వీపర్‌ గా పని చేస్తోంది. ఇప్పుడామె ఈ ప్రాంతంలో ఎంత ఫేమస్ అంటే, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఎంతో మంది పోటీలు పడుతున్నారు. అందంగా తయారు కావడమంటే తనకెంతో ఇష్టమని చెప్పుకునే బబ్లీ, స్వీపర్ పని చేస్తున్నంత మాత్రాన చక్కగా అలంకరించుకోకూడదా? అని ప్రశ్నిస్తుంది. నిజమే కదా?

  • Loading...

More Telugu News