: అమేజాన్ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే వెక్కిరిస్తున్న కుక్క!
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం 'అమేజాన్' వెబ్ సైట్ ను ఓపెన్ చేసి తమకు కావాల్సిన ప్రొడక్టుల కోసం వెతుకున్న వారికి కుక్కల బొమ్మలు కనిపిస్తూ, వెక్కిరిస్తున్నాయి. ఎంతో మంది ఈ విషయమై ఫిర్యాదులు చేయడంతో అమేజాన్ సైతం స్పందించింది. "మా వైపు నుంచే ఏదో తప్పు జరిగింది. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం" అని అమేజాన్ ఓ ప్రకటనలో తెలిపింది. హోం పేజ్ లోని ప్రొడక్టులను క్లిక్ చేసిన ప్రతి సారీ ఓ కుక్క బొమ్మ కనిపిస్తోందని పలువురు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేశారు. ఇది నిజమేనని 'రాయ్ టర్స్' సహా పలు వార్తా సంస్థలు తేల్చాయి. పసిఫిక్ టైమ్ జోన్ లో అర్థరాత్రి 2 గంటల తరువాత ఈ సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. దీనికి కారణమేంటన్న విషయమై సరైన సమాచారం లేదు.