: సర్వసన్నద్ధంగా ఉన్నాం.. చైనా, పాక్ లను ఎదుర్కోవడానికి సైన్యం సిద్ధం: ఆర్మీ చీఫ్ రావత్
ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని భారత సైన్యాధ్యక్షుడు బిపిన్ రావత్ స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్ లో అలజడికి పాకిస్థానే కారణమని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ, కశ్మీర్ యువతను పాక్ రెచ్చగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ లోని పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పాకిస్థాన్, చైనా, కశ్మీర్ పరిస్థితుల గురించి ఆయన మాట్లాడుతూ, రెండున్నర యుద్ధాలను ఎదుర్కోవడానికి ఆర్మీ సిద్ధంగా ఉందని చెప్పారు. ఆర్మీ ఆధునికీకరణకు సంబంధించిన పురోగతి బాగుందని తెలిపారు. సరిహద్దుల గుండా భారత్ లోకి చొరబడుతున్న ముష్కరులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు.