: భగవంతుడు ఆదేశించాడు... ఇలా రాసిపెట్టి వుంది: చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో భగవంతుడు తనను ఆదేశించినట్టుగానే ముందుకు సాగుతున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాసిపెట్టి వుంది కాబట్టే ఇంత త్వరగా పనులు ముగింపు ఘట్టానికి చేరుకున్నాయని, అనుకున్న సమయానికన్నా ముందుగానే ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసి చూపిస్తానని అన్నారు. "నేను ఓపెన్ గా చెబుతున్నా. పోలవరం కార్యక్రమాన్ని పూర్తి చేసే పనిలో మనం ముందున్నాం. ఐయాం వెరీ హ్యాపీ. భగవంతుడు ఆదేశించాడు. డెస్టినీ నిర్ణయించింది. ఆ పని మనం పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం" అన్నారు.
రెండు రోజుల నాటి వర్షాలకు అసెంబ్లీలోని వైఎస్ జగన్ కార్యాలయంలోకి వర్షపు నీరు రావడంపై మీడియా ప్రశ్నించగా, "అది సీబీసీఐడీ ఎంక్వైరీ ఉంది కదా? ఎంక్వైరీ కానివ్వండి. నేను ఏమంటున్నానంటే, ఈ రోజుల్లో తప్పుడు ప్రచారం చేయడం అంత మంచిది కాదు. ఈ పవిత్రమైన స్థలంలో చిన్న చిన్న విషయాలు మాట్లాడటం కరెక్టు కాదు. ఇది ఒక పెద్ద యజ్ఞం. ఇక్కడ ఆ మాటలు వద్దు. ఓకే... థ్యాంక్యూ" అంటూ తన మీడియా సమావేశాన్ని చంద్రబాబు ముగించారు.