: ఫ్రెంచ్ ఓపెన్ లో సంచలనం... థీమ్ చేతిలో జకోవిచ్ ఘోర పరాజయం
ఫ్రెంచ్ ఓపెన్ డిఫెండింగ్ చాంపియన్ జకోవిచ్ కి చుక్కెదురైంది. క్వార్టర్ ఫైనల్ పోరులో ఆస్ట్రియా యువ సంచలనం డొమినిక్ థీమ్ చేతిలో ఊహించని రీతిలో ఘోరంగా ఓడిపోయాడు. తొలి సెట్ లో తనదైన పోరాట పటిమ కనబరిచినా తృటిలో 6-7 (5-7) తేడాతో సెట్ ను కోల్పోయిన జకో, ఆపై రెండో సెట్ లో 3-6 తేడాతో ఓడాడు. తప్పనిసరిగా గెలిచి ఆటలో నిలవాల్సిన దశలో జరిగిన మూడో సెట్ లో అసలితను జకోవిచ్చేనా? అన్న ప్రశ్న అభిమానుల్లో తలెత్తేలా 0-6 తేడాతో సెట్ ను కోల్పోయి, అవమాన భారంతో సెమీస్ కు చేరకుండానే టోర్నీ నుంచి వెనుదిరిగాడు. థీమ్ ముందు జకోవిచ్ ఓ అన్ సీడెడ్ ఆటగాడిగా కనిపించాడని మ్యాచ్ తరువాత అభిమానులు వ్యాఖ్యానించారు. ఇక, పదో విడత ఫ్రెంచ్ ఓపెన్ పై కన్నేసిన నాదల్, క్వార్టర్ ఫైనల్స్ లో ప్రత్యర్థి కారెనో బుస్టాపై గెలిచాడు. బుస్టా గాయంతో నిష్క్రమించడంతో నాదల్ గెలుపు సునాయాసమైంది.