: ధోనీ దృష్టిలో షోయబ్ అఖ్తర్... మరి యువరాజ్ సింగ్ దృష్టిలో ఎవరు?


టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తానెదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ గా పాకిస్థాన్ స్పీడ్ స్టర్ షోయబ్ అఖ్తర్ పేరును చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ కెరీర్ లో భయపెట్టిన బౌలర్ ఎవరంటూ మీడియా ప్రశ్నించింది. దానికి యువీ సమాధానం చెబుతూ, తన కెరీర్  ఆరంభంలో ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్ మెక్ గ్రాత్ భయపెట్టాడని చెప్పాడు. మెక్ గ్రాత్ బౌలింగ్ ను ఎదుర్కోవడం సవాలేనన్నాడు. ఎందుకంటే... ఆప్ స్టంప్ పై దూసుకొచ్చే మెక్ గ్రాత్ బంతిని ఎదుర్కోవడం ఎవరికైనా కష్టమేనని చెప్పాడు. బంతిని గురితప్పకుండా సంధించడంలో మెక్ గ్రాత్ దిగ్గజమని తెలిపాడు.

  • Loading...

More Telugu News