: రోజుకో గుడ్డు తింటే ఎన్నో లాభాలు.. తాజా పరిశోధనలో మరోసారి వెల్లడి!


రోజుకో గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిద‌ని, శ‌రీరానికి పుష్క‌లంగా పోషకాలు అందుతాయ‌ని వైద్యులు సూచిస్తుంటారు. ఈ విష‌యం మ‌రోసారి రుజువైంది. తాజాగా వాషింగ్టన్‌ యూనివర్శిటీ పరిశోధకురాలు లోరా ఐనొట్టి పిల్లల‌పై జ‌రిపిన ప‌రిశోధ‌న‌లో ఇదే విష‌యం తేలింది. ఆరు నెలలపాటు 6 నుంచి 9 నెలల మధ్య వయస్సు ఉన్న చిన్నారులపై ఐనొట్టి ఈ ప‌రిశోధ‌న జ‌రిపారు. వారికి రోజుకు ఒక కోడి గుడ్డును అందించారు. మరికొందరికి సాధారణ ఆహారం ఇచ్చారు. దీని ఫ‌లితంగా రోజుకో గుడ్డును తినిపిస్తే పిల్లల్లో స‌క్ర‌మంగా ఎదుగుదల ఉంటుంద‌ని తేలిందని చెప్పారు. చిన్నారుల్లో వ్యాధుల వ్యాప్తిని కూడా 47 శాతం మేరకు గుడ్డు తగ్గిస్తుందని చెప్పారు. గుడ్డు త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తుంది కాబ‌ట్టి ప్ర‌తిరోజు పిల్ల‌ల‌కు ఓ గుడ్డు అందించాల‌ని సూచించారు. రోజుకో గుడ్డు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంద‌ని, వ్యాధుల నివార‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తేలింద‌ని చెప్పారు.    

  • Loading...

More Telugu News