: మధ్యప్రదేశ్‌లో భారీ అగ్ని ప్రమాదం ...14 మంది మృతి
మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లోని ఓ బాణసంచా కర్మాగారంలో ఈ రోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా బాణసంచా కర్మాగారంలో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ్డాయని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాద స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో గాయాలపాలయిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం షాట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? లేక మరే కారణం వల్లయినా జరిగిందా? అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.