: అణచివేత వద్దు... సమస్యను పరిష్కరించండి: మధ్యప్రదేశ్ సీఎంకు నానా పటేకర్ హెచ్చరిక
రైతు సమస్యలపై పోరాటాన్ని పోలీసులతో అణచివేయాలని చూడవద్దని... సమస్యను పరిష్కరించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ సూచించారు. ఎంపీలోని మాందాసౌర్ లోని రైతుల ఆందోళనను అణచివేసేందుకు పోలీసులు కాల్పులు జరపడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆగ్రహానికి గురైతే పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయాలని హెచ్చరించారు. వారి ఆగ్రహానికి గురికావద్దని...వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. అలా కాకుండా పోలీసులతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే కనుక ఉద్రిక్తత తలెత్తుందని ఆయన హెచ్చరించారు.