: గొర్రె పిల్లల పంపిణీపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి: కోదండరాం విమర్శలు


తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న చేప పిల్లల పెంపకంలో మోసాలు ఉన్నాయ‌ని టీజేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రాం అన్నారు. గొర్రె పిల్లల పంపిణీపై కూడా త‌మ‌కు ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఈ రోజు న‌ల్గొండ‌లో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన‌ జిల్లా సమగ్రాభివృద్ధిపై సదస్సులో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... రాష్ట్ర‌ ఆదాయం పెరిగితే అభివృద్ధి జరిగినట్టు కాదని తెలిపారు. మనిషి జీవన ప్రమాణాలు పెర‌గాల‌ని పేర్కొన్నారు. విద్య, వైద్యం అందరికి అందుబాటులోకి రావాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. తెలంగాణ‌లో వ్యవసాయం మీద ఆధారపడే రైతులు కూలీలుగా మారిపోతున్నారని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.     

  • Loading...

More Telugu News