: ఇంట్లోంచే 'చంద్ర'పాలన


సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇంట్లో ఉంటూనే పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఈ రోజు ముఖ్య నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, యనమల రామకృష్ణుడు, గాలి ముద్దు కృష్ణమ నాయుడు, పరిటాల సునీత, గరికపాటి మోహన్ రావు తదితరులతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ నెలలో జరగనున్న మహానాడు ఏర్పాట్లు, విద్యుత్ సమస్యకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ తదితర అంశాలు చర్చకు వచ్చాయి.

  • Loading...

More Telugu News