: పులులకు ఆహారంగా బతికున్న గాడిదను వదిలిన సిబ్బంది.. విమర్శలు!


తమ జూపార్క్ కు ఎలాంటి ఆదాయం రావడం లేదన్న కారణంతో పులులకు బతికున్న గాడిదను ఆహారంగా పంపించిన ఘ‌ట‌న చైనాలోని ఎన్ చెంగ్- చాంగ్ చౌ జూ పార్కులో చోటు చేసుకుంది. ఈ అమానవీయ ఘ‌ట‌నపై ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఆకలితో ఉన్న పులుల ఎన్ క్లోజర్ లోకి జూ సిబ్బంది ఓ గాడిదను వ‌దిలారు. దీంతో ఆ గాడిదపై పులులు విరుచుకుపడుతూ, తమ పంజాలు విసిరాయి. దాన్ని చంపేసి తినేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.


  • Loading...

More Telugu News