: 178.06 ఎకరాల ప్రభుత్వ భూమికి చెందిన రికార్డులు తారుమారయ్యాయి: 'విశాఖ భూ కుంభకోణం'పై జిల్లా కలెక్టర్
ప్రభుత్వ భూములను తప్పకుండా పరిరక్షిస్తామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. విశాఖపట్నంలో బయటపడిన అతి పెద్ద భూ కుంభకోణం కేసు గురించి ఆయన ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖపట్నంలోని కొమ్మాదిలో 178.06 ఎకరాల ప్రభుత్వ భూమికి చెందిన రికార్డులు తారుమారయ్యాయని వివరించారు. మధురవాడలో మొత్తం 38 సర్వే నెంబర్లలో 98 ఎకరాల రికార్డులు తారుమారు చేశారని తెలిపారు. ఆయా భూములపై ఇంకా సర్వే కొనసాగుతోందని చెప్పారు. అటవీ శాఖ కూడా భూములను పరిశీలన చేస్తోందని చెప్పారు. వివరాలన్నీ 'వెబ్ ల్యాండ్' వెబ్ సైట్ లో పెడుతున్నట్లు తెలిపారు.