: నేను చాలా కాస్ట్ లీ... బీసీసీఐ నన్ను భరించలేదు!: షేన్ వార్న్


తాను చాలా ఖరీదైన ఆటగాడినని ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్ తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షేన్ వార్న్ ను, టీమిండియా చీఫ్ కోచ్ గా రావడానికి ఆసక్తి ఉందా? అని ప్రశ్నించగా, స్పందిస్తూ, తాను చాలా కాస్ట్ లీ ఆటగాడినని, బీసీసీఐ తనను భరించలేదని అన్నాడు. కోహ్లీ, తాను కలిస్తే మంచి ఫలితాలు అందుకోగలమని చెప్పిన వార్న్... బీసీసీఐ తనకు ఆ పదవి ఇస్తుందని భావించడం లేదని చెప్పాడు.

ఫైనల్  గా తాను చెప్పేదేంటంటే... తాను చాలా ఖరీదైన ఆటగాడినని ముక్తాయించాడు. కాగా, జూన్ 20తో కోచ్ కుంబ్లే పదవీ కాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త కోచ్ ఎంపికకు బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ పదవికి టామ్‌ మూడీ, మెక్‌ డెర్మాట్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, దొడ్డా గణేశ్‌, లాల్‌ చంద్‌ రాజ్‌ పుత్‌, ఇంగ్లాండ్‌ కి చెందిన రిచర్డ్‌ పైబస్‌ దరఖాస్తు చేసుకోగా, కుంబ్లే నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకానున్నాడు. సెహ్వాగ్ స్కైప్ ద్వారా ఇంటర్వ్యూకి హాజరుకానున్నాడు. దరఖాస్తు చేయనందున వార్న్ ఇంటర్వ్యూకు అనర్హుడు.

  • Loading...

More Telugu News