: ఇస్రో ‘బాహుబలి రాకెట్’ తీసుకున్న సెల్ఫీలు చూడండి!
భారత ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేస్తూ ఘన విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్న ఇస్రో... జీఎస్ఎల్వీ మార్క్-3 డీ1 రాకెట్ ద్వారా జీశాట్-19 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ‘బాహుబలి’ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లే క్రమంలో దానికి అమర్చిన కెమెరాల ద్వారా సెల్ఫీలు తీసి పంపించింది. ప్రయోగం ప్రారంభమైనప్పటి నుంచీ కొన్ని సెల్ఫీలు తీసుకున్న ఈ రాకెట్... బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్లతో ఇన్ఫ్రారెడ్ కలర్లో కనిపిస్తూ 200 టన్నుల బూస్టర్లు ఎర్రగా మండిపోతున్న దృశ్యాలను పంపింది. అంతేకాదు, ఆ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెడుతున్నప్పటి ఛాయా చిత్రాలను కూడా సెండ్ చేసింది.