: ఇరాన్ పై దాడి తమ పనేనన్న ఐసిస్... చిన్న దాడిగా అభివర్ణించిన ఇరాన్ పార్లమెంట్!


ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ లో చోటుచేసుకున్న ఉగ్రదాడుల పని తమదేనని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇరాన్ పార్లమెంట్, అయాతుల్లా ఖొమెయినీ సమాధి భవనం వద్దకు ఉగ్రవాదులు చొరబడ్డారు. అయితే అయాతుల్లా ఖొమెయినీ సమాధివద్ద ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు కాల్చి చంపగా, పార్లమెంటు వద్ద మరో ఉగ్రవాది తనను తాను పేల్చుకున్నాడు. ఈ దాడిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి బాధ్యులం తామేనని ఐసిస్ ప్రకటించింది.

కాగా, ఈ దాడి చాలా చిన్న సంఘటన అని ఇరాన్‌ స్పీకర్‌ అల్‌ లార్జానీ పేర్కొన్నారు. ఉగ్రవాదులు ఇరాన్‌ కు సమస్యలు సృష్టించాలని అనుకుంటున్నారని, అయితే వారి ఆశలు నెరవేరవని అన్నారు. ఎందుకంటే ఉగ్రదాడులను ఎదుర్కోవడంలో ఇరాన్ చాలా చురుగ్గా ఉంటుందని ఆయన చెప్పారు. దీనిపై ఇరాన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటెలిజెన్స్‌ మాట్లాడుతూ, ఉగ్రవాదులు మూడు ఆత్మాహుతి దాడులకు ప్రణాళికలు రచించుకుని వచ్చారని, అయితే ఒకడిని ముందుగానే పట్టేయడం, రెండో వ్యక్తిని గుర్తించి కాల్చిచంపడంతో పెను నష్టాన్ని నివారించగలిగామన్నారు. మూడో వ్యక్తిని పట్టుకునేలోపు తనను తాను పేల్చేసుకున్నాడని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News